Showing posts with label పిల్లి మీద పద్యాలు. Show all posts
Showing posts with label పిల్లి మీద పద్యాలు. Show all posts

Friday, August 30, 2013

పిల్లి

పిల్లి

అల్లరిచేస్తే పిల్లొస్తుంది
ముక్కూ చెవులూ రక్కేస్తుంది
అల్లరిమానీ పిల్లల్లారా
చల్లగ మెల్లగ కూర్చోండర్రా
(పిల్లలు మారాంచేస్తే మానిపించటానికి ఇలాంటి పాటలే మాటలే చెబుతారు అమ్మలు)




మ్యావ్ మ్యావ్ పిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి 

మ్యావ్ మ్యావ్ పిల్లి -- పాలకోసం వెళ్ళి 
వంటగదికి మళ్ళి -- తలుపు చాటుకెళ్ళీ 
మూతతీసి తాగ -- మూతి కాలె బాగా 
అమ్మవచ్చి చూచె -- నడ్డి విరగగొట్టె 


(పిల్లి ఎప్పుడూ దొంగతనంగా వంటింటిలోకి దూరిపోయి.... పాలు తగేస్తూ ఉంటుంది. అలా దొంగతనంగా పాలు తాగటం దాని సహజ గుణం. దాని కాళ్ళు , నడ్డి విరగగొట్టటం మన సహజ లక్షణం. కానీ ఈ రోజుల్లో పిల్లులకి అందకుండా పాలు-- పెరుగులు ఫ్రిజ్ లలోనే ఉంటున్నాయి.)





Sunday, June 23, 2013

మాయదారిపిల్లి

మాయదారిపిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి -- మయదారిపిల్లి 
మ్యావ్ మ్యావ్ పిల్లి -- మీసాల పిల్లి 

దొంగవలె -- ఇంటికొచ్చి 
పాలుతాగి -- పెరుగుతిని 

నేతి గిన్నె -- ఖాళీ చేసి 
కుండలన్ని -- కిందతోసి

కళ్ళుతెరిచి -- మూసికొనుచు
పారిపోవు -- దొంగపిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి -- మాయదారి పిల్లి
మ్యావ్ మ్యావ్ పిల్లి -- మీసాల పిల్లి

(మీ ఇంటికి కూడా పిల్లుల్లు వచ్చి ఇలాగే పాలు, పెరుగు తగేస్తాయా మా ఇంటికి వచ్చి దొంగ పిల్లులు తగేస్తాయి)





Sunday, April 21, 2013

బడాయి పిల్లి

బడాయి పిల్లి


బడాయి పిల్లి లడాయి కెళ్ళి 
మిడుతను చంపి ఉడుత అన్నది
ఉడుతను చంపి ఉడుం అన్నది 
ఎలుకను చంపి ఏనుగు అంది 
సింహం తానని పొంగిన పిల్లి 
కుక్కను చూచి ఒకటే పరుగు