పిల్లల పద్యాలు --- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు
అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!
అప్ప రారా! కూర్మికుప్ప రార!
రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ
తోట రారా! ముద్దుమూట రార!
ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!
పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!
కన్నకాచి రార! గారాలకూచి రా!
నాన్నరార! చిన్నియన్నరార!
ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు
లాడ రార! కుల్కులాడ రార!
1 చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!
అయ్య రారా! చక్కనయ్య రార!అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!
అప్ప రారా! కూర్మికుప్ప రార!
రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ
తోట రారా! ముద్దుమూట రార!
ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!
పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!
కన్నకాచి రార! గారాలకూచి రా!
నాన్నరార! చిన్నియన్నరార!
ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు
లాడ రార! కుల్కులాడ రార!
No comments:
Post a Comment