పిల్లల జోలపాటలు
1)
ఊ చక్క వూగదే వుయ్యాలచేరు
పా డక్క నిద్రపోడు పట్టి అబ్బాయి
2)
విశాఖపట్నాన విసిరింది గాలి
వింజరపురేవున్న తేలిందె వాడ
వర్తకుడి పేరేమి వాడ పేరేమి
వాడలో పోసిన్న దినుసు పేరేమి
వర్తకుడు అబ్బాయి వాడ నా వాడ
వాడలో పోసిన్న దినుసు ముత్యాలు.
3)
ఇంతంత దీపమ్ము యిల్లల్ల వెలుగు
ఈశ్వరుడి చందమామ జగతెల్ల వెలుగు
గోరంత దీపమ్ము కొండల్ల వెలుగు
గోపాలకృష్ణమ్మ మందల్ల వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
మారాజు అబ్బాయి మాకళ్లవెలుగు.
4)
సూర్యుడు చంద్రుడు అన్నదమ్ముల్లు
సూటిగుఱ్ఱాలెక్కి జూదమాడేరు
అబ్బాయి తమ్ముడు అన్నదమ్ముల్లు
లక్కపావా లెక్కి లెక్క రాసేరు.
5)
ఏటిగట్టుమీద సంధ్యల్లు వార్చి
ఎఱ్ఱన్ని చినవాడు ఎవరి అబ్బాయి
నాగ గంధపు చెవులపోగు లున్నాయి
నా మేనఅల్లుడు రార అబ్బాయి!
6)
ఏటిగట్టుమీద కరివేపచెట్టు
గాలివానవచ్చి కొమ్మ లల్లాడె
కొమ్మలల్లాడెనే గొలుసు లల్లాడె
కొనికొన్ని ముత్యాలచేరు లల్లాడె
ఆచెట్లపైనుండి అబ్బాయిరాగ
బంగారుతలపాగ చెంగు లల్లాడె.
7)
ఏవాడ వెళ్లేవు అబ్బాయి నువ్వు
ఎవ్వరు కట్టేరు కాళ్లమువ్వల్లు
కలవారిపట్టన్ని గారాములన్ని
కంచారికట్టేడె కంచుమువ్వల్లు
తనతోడి పట్టన్ని తనకు ముద్దన్ని
అన్నయ్యకట్టేడె వెండిమువ్వల్లు.
8)
చిక్కూడు పువ్వెరుపు చిలకముక్కెరుపు
చిగురెరుపు చింతల్ల దోరపండెరుపు
రక్కిసపండెరుపు రాగిచెంబెరుపు
రాచవారిళ్లలో మాణిక్యమెరుపు
తాయెరుపు అమ్మాయి తనవారిలోన.
9)
ఏనుగు యెక్కియ్యె ఓరాజురాగ
ఏకదివాణమ్ము యెవరి లోగీలి
పల్లకి ఎక్కియ్యె ఓరాజు రాగ
బంగారుతలుపుల్ది యెవరి లోగీలి
అందలా లెక్కియ్యె ఓరాజు రాగ
అద్దాల తలుపుల్ది యెవరి లోగీలి
ఏనూగ యెక్కియ్యె అబ్బాయి రాగ
ఏకదివాణమ్ము వదినె లోగీలి
పల్లకీయెక్కియ్యె అబ్బాయి రాగ
బంగారుతలుపుల్ది వదినె లోగీలి
అందలా లెక్కియ్యె అబ్బాయి రాగ
అద్దాల తలుపుల్ది వదినె లోగీలి.
10)
గంధమ్ము తీసిన్న సాన చల్లన్న
సభలోన అబ్బాయిమాట చల్లన్న
ఇండూవ తీసిన్న నీళ్లు చల్లన్న
ఇంట్లోన అమ్మాయి కడుపు చల్లన్న
11)
గోపాలకృష్ణమ్మ పెళ్లయ్యెనాడు
గోరింట పూచింది కొమ్మలేకుండ
మాయింటి అబ్బాయి పెళ్లయ్యెనాడు
మల్లెల్లు పూచేయి మొగ్గలేకుండ.
12)
ఉయ్యాలలో బాల వుగ్గు కేడుస్తే
ఉత్తమ్మ యేశోద వూచి వుగ్గొయ్యి
పల్లకీలో బాల పాలకేడుస్తే
బలభద్ర మాలక్ష్మి పాడి పాలొయ్యి
ఏటిక్కి కాలువ యెంతదూరమ్ము
యెత్తిపెంచినతల్లి కెంత మోహమ్ము
కాలువ నీళ్లన్ని కడుసముద్ర మాయె
కడలేని మోహమే కన్నతల్లిక్కి.
13)
ఊరిక్కి ఉద్యోగరాజు వచ్చేడు
విడిమట్టు చూపండి విందు నాయిల్లు
ఊరిక్కి ఉద్యోగరాజు అబ్బాయి
విడిమట్టు నీ యిల్లు విందు నాయిల్లు
14)
ఆటల్లు పాటల్లు అత్తవారింట
అతి రాచచిటిపనులు అమ్మగారింట.
15)
తోటకూరా చెట్టెయ్యవలెను
దొగ్గలి పెరిగింది దొడ్డిమందార
రాచయింటా కన్నెయ్యవలెను
అబ్బాయియింటికే వచ్చింది కన్నె.
16)
చిక్కుడాకూమీద చిలక వాలింది
చిల కెక్కి ఓరాజు చిక్కివున్నాడు
అరిటాకుమీద హంస వాలింది
హం సెక్కి ఓరాజు అమిరివున్నాడు
కొబ్బరాకుమీద గోర వాలింది
గోరెక్కి ఓరాజు కోరివున్నాడు
మామిడాకుమీద మంచు వాలింది
మం చెక్కి ఓరాజు పొంచివున్నాడు
గుమ్మడాకుమీద గువ్వ వాలింది
గువ్వెక్కి ఓరాజు గూడొగ్గినాడు
చిక్కుడాకు మీద చిలక అబ్బాయి
చిలకెక్కి అమ్మాయి చిక్కివున్నాది
అరిటాకుమీదనే హంస అబ్బాయి
హం సెక్కి అమ్మాయి అమిరివున్నాది
కొబ్బరాకుమీద గోర అబ్బాయి
గో రెక్కి అమ్మాయి కోరివున్నాది
మామిడాకుమీద మంచు అబ్బాయి
మం చెక్కి అమ్మాయి పొంచివున్నాది
గుమ్మిడాకుమీద గువ్వ అబ్బాయి
గువ్వెక్కి అమ్మాయి గూ డొగ్గినాది.
17)
వేసంగికాలాన ఓ పెళ్లికొడకా
వేపతోరణాల నీడనే రమ్మి
మాయింటి అబ్బాయి పెళ్లయ్యెనాడు
మామిడితోరణాలు మరి దూరిరమ్మి.
18)
దేవూడిగుళ్లోను దేవు డాడీని
దేవేంద్రసభలోన జూద మాడీని
పరమేశ్వరుడు గుళ్లోను పాము లాడీని
పణతి నా నట్టింట బాల లాడీని.
19)
పిల్లి పిల్లిపిల్లి పిల్లలకుతల్లి
పల్లేరుముళ్లలో పాలిచ్చి పోవె
పిల్లలికి పాలోసి పల్లెలికి బంపి
అబ్బాయికి పాలోసి ఆడుకో బంపు.
20)
వీధి నెందరు వున్న విసరేగాలి
రచ్చ నెందరువున్న రాదమ్మ వాన
నా చిన్న అబ్బాయి వీధి నిలుచుంటే
మొగలిపువ్వులగాలి ముత్యాలవాన.
21)
చిలక లాడేనమ్మ హంస లాడేని
పావురా లాడేని పందిళ్లలోన
చిలక నాఅబ్బాయి హంస అబ్బాయి
పావురం కుఱ్ఱవాడు పందిళ్లలోన.
22)
పిల్లెమ్మకన్నుల్లు బీరపువ్వుల్లు
అబ్బాయికన్నులు కలువరేకుల్లు
కలువరేకులవంటి నీ కన్నులాకు
కాటుకలు పెట్టుతే నీకు అందమ్ము.
23)
ఏడవకు ఏడవకు వెఱ్ఱినాతండ్రి
ఏడుస్తెనీకళ్ల నీరు కారేని
నీళ్లూనుకారితే నేచూడలేను
పాలైనకారవే బంగారుకళ్ల.
24)
చింతచెట్టుకింద చిటిబొమ్మరిళ్లు
వాటిక్కి వాకళ్లు బోరుతలుపుల్లు
బోరుతలుపులకింద పొందైనమేడ
ఆమేడనున్నాయి యిద్దరు హంసల్లు - ఆమేడ
ఆయిద్దరు హంసల్ల పేరేమిపేరు - ఆయిద్దరు
రాచిలుక అబ్బాయి రంభ అమ్మాయి - రాచిలుక
చిలుకలకు చెలికాడు తాను అబ్బాయి - చిలుకలకు
హంసలకు చెలికత్తె తాను అమ్మాయి.
25)
అబ్బాయి మామల్లు యెటువంటివారు
చెవికిచెవికి బారెడేసి పోగుల్లవారు - చెవికి
అంచుపంచెలవారు అంగీలవారు - అంచు
పట్టుపంచెలవారు పాగాలవారు - పట్టు
పెసరకాయవంటి పెదిమెల్లవారు - పెసర
కందికాయలవంటి కనుబొమ్మల్లవారు - కంది
మిరపకాయలవంటి మీసాలవారు - మిరప
వారు మా అబ్బాయి మేనమామల్లు.
26)
తామలపాకులమీద రేకల్లువ్రాసి
తమ్ము డంపినాడె తనముద్దుమాట
తనముద్దుమా టొకటి దబ్బపండొకటి
"నాచిన్న తమ్ముడు రార అబ్బాయి."
27)
గోరింటపువ్వువంటి కొడుకు నెత్తుకొని
బాలింత వచ్చింది బావినీళ్లక్కు
ఏదేది బాలింత యెంత చక్కందొ
మా చిన్ని పట్టుచీర మణవలకు పసుపు
కళ్లదీ కాటుక పళ్లదీ యెరుపు
మావాడ బాలింత అబ్బాయితల్లి.
28)
తూర్పున్న అబ్బాయి యిల్లుకట్టేడు
దూలాలుమోసేరు దూదిపరుపుల్లు
పడమటను అబ్బాయి యిల్లు కట్టేరు
పట్టెల్లు మోసేరు పాలకావిళ్లు
దక్షిణాన్ని అబ్బాయి యిల్లుకట్టేడు
దండెల్లు మోసేరు ధనముపెట్టెలు
ఉత్తరాన అబ్బాయి యిల్లుకట్టేడు
29)
తాతల్లు గట్టిన్న ధర్మశాలల్లు
అవ్వలు అలికిన అరుగుల్లమీద
ముత్తవ్వలు పెట్టిన ముగ్గులమీద
కూచోర అబ్బాయి కుదిమట్టగాను - కూచోర
ఊచవే అమ్మాయి వుయ్యాలచేరు - ఊచవే
పాడవే అమ్మాయి బలగ మందర్ని - పాడవే
ధరణిచే రట్టుకొని తనవార్ని పాడె - ధరణి
భూమిచేరట్టుకొని పుత్రుణ్ని పాడె.
30)
ఊరీముందర డేర లెవ్వరివి
ఉత్తమ్మబిరుదుల్ల రా జెవ్వరమ్మ
ఊరీముందర డేరల్లుమావి
ఉత్తమ్మ బిరుదల్ల రాజు అబ్బాయి.
31)
ఆయిఆయిఆయి ఆపదలు గాయి
చిన్నవాళ్లనుగాయి శ్రీవెంకటేశ
గాయిగాయిగాయి ఏదమ్మగాయి
అంగళ్ల ఆడేటి అబ్బాయిని గాయి
పోలేరమ్మ పొత్తుళ్లుగాయి
పొత్తుళ్లనాడేటి అబ్బాయి గాయి.
32)
చిన్నారిపాచికలు మావిలోగిళ్లు
చిన్నబాలా ఆడు చినబాల్లుతోడి
బంగారు పాచికలు మావిలోగిళ్లు
బాలలాడేరు మా అబ్బాయితోడి.
33)
కోటంత దేవుడికి మేటంతపత్రి
బ్రహ్మంత ఆయుస్సు నీకు నా బాబు.
34)
జోలల్లు పాడితే జొన్నల్లుపండు
జోలలకు జొనబువ్వ నీకు వరిబువ్వ
ఏడ్చేటి అబ్బాయికి యెఱ్ఱావుపాలు
నాచిన్నఅబ్బాయికి నల్లావుపాలు.
35)
అబ్బిని కొట్టిన కొట్టు వూరెల్ల రట్టు
తేరె మా అబ్బాయికి ముత్యాలబొట్టు
ముత్యాలబొట్టు మావిరేకల్లు
రత్నాలబొట్టుకీ రావిరేకల్లు
వజ్రాలుస్థాపించిన వారి మామల్లు
మాణిక్యాలు స్థాపించిన వారి బాబుల్లు
36)
అబ్బిని కొట్టిన కొట్టు వూరెల్ల రట్టు
తేరె మా అబ్బాయికి తేనె గాజుల్లు
ముత్యాలబొట్టెట్టి పట్టుచీరగట్టి
ముద్దువచ్చింది మా అబ్బాయిమోము - ముద్దు
అద్దమైతోచింది వద్దిమామలకు - అద్దమై
మేలిమై తోచింది మేనమామలకు - మేలి.
మేనమామలముద్దు మేలిమ్మి ముద్దు - మేన
తాతలకు తమ చిన్న అబ్బాయి ముద్దు.
37)
చిట్టి నాఅబ్బాయి చిఱుమొగము చూచి
సిగ్గుపడి చంద్రుడూ పొడవజాలాడు
38)
ముద్దుల్లు ముద్దుల్లు ముచ్చికాయల్లు
అమ్మాయి ముద్దుల్లు గచ్చకాయల్లు.
పూర్వకాలంలో పిల్లలని నిద్రపుచ్చటానికి, ఊయల ఊపుతూ నానమ్మలు, అమ్మమ్మలు, అమ్మలు పాడే లాలి(జోల)పాటలు ఇవి ....... వాడపల్లి శేషతల్పశాయి & కాలెపు నాగభూషణరావు అనే ఇద్దరు తెలుగు భాషాభిమానులు నడుపుతున్న ఆంధ్రభారతి అనే వెబ్ సైటులో నాకు ఈ జోలపాటలు, ఆటపాటలు, పణతిపాటలు, ప్రకీర్ణములు కనిపించాయి ..... ఎప్పటి నుండో ఇటువంటి పాటల కోసం వెతుకుతున్న నాకు ఇవి కనిపించగానే పట్టలేని ఆనందం కలిగి, వీటిని నా బ్లాగులో కూడా పొందుపరుచుకోవాలని ఆశకలిగింది. మరుగున పడుతున్న మన సంప్రదాయపు పాత పాటలని వెతికి, వెలికితీసి అందరికీ అందిస్తున్న శేషతల్పశాయి గారికి, నాగభూషణరావు గారికి కృతజ్ఞతలు ____//\\____ తెలుపుకుంటున్నాను.
1)
ఊ చక్క వూగదే వుయ్యాలచేరు
పా డక్క నిద్రపోడు పట్టి అబ్బాయి
2)
విశాఖపట్నాన విసిరింది గాలి
వింజరపురేవున్న తేలిందె వాడ
వర్తకుడి పేరేమి వాడ పేరేమి
వాడలో పోసిన్న దినుసు పేరేమి
వర్తకుడు అబ్బాయి వాడ నా వాడ
వాడలో పోసిన్న దినుసు ముత్యాలు.
3)
ఇంతంత దీపమ్ము యిల్లల్ల వెలుగు
ఈశ్వరుడి చందమామ జగతెల్ల వెలుగు
గోరంత దీపమ్ము కొండల్ల వెలుగు
గోపాలకృష్ణమ్మ మందల్ల వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
మారాజు అబ్బాయి మాకళ్లవెలుగు.
4)
సూర్యుడు చంద్రుడు అన్నదమ్ముల్లు
సూటిగుఱ్ఱాలెక్కి జూదమాడేరు
అబ్బాయి తమ్ముడు అన్నదమ్ముల్లు
లక్కపావా లెక్కి లెక్క రాసేరు.
5)
ఏటిగట్టుమీద సంధ్యల్లు వార్చి
ఎఱ్ఱన్ని చినవాడు ఎవరి అబ్బాయి
నాగ గంధపు చెవులపోగు లున్నాయి
నా మేనఅల్లుడు రార అబ్బాయి!
6)
ఏటిగట్టుమీద కరివేపచెట్టు
గాలివానవచ్చి కొమ్మ లల్లాడె
కొమ్మలల్లాడెనే గొలుసు లల్లాడె
కొనికొన్ని ముత్యాలచేరు లల్లాడె
ఆచెట్లపైనుండి అబ్బాయిరాగ
బంగారుతలపాగ చెంగు లల్లాడె.
7)
ఏవాడ వెళ్లేవు అబ్బాయి నువ్వు
ఎవ్వరు కట్టేరు కాళ్లమువ్వల్లు
కలవారిపట్టన్ని గారాములన్ని
కంచారికట్టేడె కంచుమువ్వల్లు
తనతోడి పట్టన్ని తనకు ముద్దన్ని
అన్నయ్యకట్టేడె వెండిమువ్వల్లు.
8)
చిక్కూడు పువ్వెరుపు చిలకముక్కెరుపు
చిగురెరుపు చింతల్ల దోరపండెరుపు
రక్కిసపండెరుపు రాగిచెంబెరుపు
రాచవారిళ్లలో మాణిక్యమెరుపు
తాయెరుపు అమ్మాయి తనవారిలోన.
9)
ఏనుగు యెక్కియ్యె ఓరాజురాగ
ఏకదివాణమ్ము యెవరి లోగీలి
పల్లకి ఎక్కియ్యె ఓరాజు రాగ
బంగారుతలుపుల్ది యెవరి లోగీలి
అందలా లెక్కియ్యె ఓరాజు రాగ
అద్దాల తలుపుల్ది యెవరి లోగీలి
ఏనూగ యెక్కియ్యె అబ్బాయి రాగ
ఏకదివాణమ్ము వదినె లోగీలి
పల్లకీయెక్కియ్యె అబ్బాయి రాగ
బంగారుతలుపుల్ది వదినె లోగీలి
అందలా లెక్కియ్యె అబ్బాయి రాగ
అద్దాల తలుపుల్ది వదినె లోగీలి.
10)
గంధమ్ము తీసిన్న సాన చల్లన్న
సభలోన అబ్బాయిమాట చల్లన్న
ఇండూవ తీసిన్న నీళ్లు చల్లన్న
ఇంట్లోన అమ్మాయి కడుపు చల్లన్న
11)
గోపాలకృష్ణమ్మ పెళ్లయ్యెనాడు
గోరింట పూచింది కొమ్మలేకుండ
మాయింటి అబ్బాయి పెళ్లయ్యెనాడు
మల్లెల్లు పూచేయి మొగ్గలేకుండ.
12)
ఉయ్యాలలో బాల వుగ్గు కేడుస్తే
ఉత్తమ్మ యేశోద వూచి వుగ్గొయ్యి
పల్లకీలో బాల పాలకేడుస్తే
బలభద్ర మాలక్ష్మి పాడి పాలొయ్యి
ఏటిక్కి కాలువ యెంతదూరమ్ము
యెత్తిపెంచినతల్లి కెంత మోహమ్ము
కాలువ నీళ్లన్ని కడుసముద్ర మాయె
కడలేని మోహమే కన్నతల్లిక్కి.
13)
ఊరిక్కి ఉద్యోగరాజు వచ్చేడు
విడిమట్టు చూపండి విందు నాయిల్లు
ఊరిక్కి ఉద్యోగరాజు అబ్బాయి
విడిమట్టు నీ యిల్లు విందు నాయిల్లు
14)
ఆటల్లు పాటల్లు అత్తవారింట
అతి రాచచిటిపనులు అమ్మగారింట.
15)
తోటకూరా చెట్టెయ్యవలెను
దొగ్గలి పెరిగింది దొడ్డిమందార
రాచయింటా కన్నెయ్యవలెను
అబ్బాయియింటికే వచ్చింది కన్నె.
16)
చిక్కుడాకూమీద చిలక వాలింది
చిల కెక్కి ఓరాజు చిక్కివున్నాడు
అరిటాకుమీద హంస వాలింది
హం సెక్కి ఓరాజు అమిరివున్నాడు
కొబ్బరాకుమీద గోర వాలింది
గోరెక్కి ఓరాజు కోరివున్నాడు
మామిడాకుమీద మంచు వాలింది
మం చెక్కి ఓరాజు పొంచివున్నాడు
గుమ్మడాకుమీద గువ్వ వాలింది
గువ్వెక్కి ఓరాజు గూడొగ్గినాడు
చిక్కుడాకు మీద చిలక అబ్బాయి
చిలకెక్కి అమ్మాయి చిక్కివున్నాది
అరిటాకుమీదనే హంస అబ్బాయి
హం సెక్కి అమ్మాయి అమిరివున్నాది
కొబ్బరాకుమీద గోర అబ్బాయి
గో రెక్కి అమ్మాయి కోరివున్నాది
మామిడాకుమీద మంచు అబ్బాయి
మం చెక్కి అమ్మాయి పొంచివున్నాది
గుమ్మిడాకుమీద గువ్వ అబ్బాయి
గువ్వెక్కి అమ్మాయి గూ డొగ్గినాది.
17)
వేసంగికాలాన ఓ పెళ్లికొడకా
వేపతోరణాల నీడనే రమ్మి
మాయింటి అబ్బాయి పెళ్లయ్యెనాడు
మామిడితోరణాలు మరి దూరిరమ్మి.
18)
దేవూడిగుళ్లోను దేవు డాడీని
దేవేంద్రసభలోన జూద మాడీని
పరమేశ్వరుడు గుళ్లోను పాము లాడీని
పణతి నా నట్టింట బాల లాడీని.
19)
పిల్లి పిల్లిపిల్లి పిల్లలకుతల్లి
పల్లేరుముళ్లలో పాలిచ్చి పోవె
పిల్లలికి పాలోసి పల్లెలికి బంపి
అబ్బాయికి పాలోసి ఆడుకో బంపు.
20)
వీధి నెందరు వున్న విసరేగాలి
రచ్చ నెందరువున్న రాదమ్మ వాన
నా చిన్న అబ్బాయి వీధి నిలుచుంటే
మొగలిపువ్వులగాలి ముత్యాలవాన.
21)
చిలక లాడేనమ్మ హంస లాడేని
పావురా లాడేని పందిళ్లలోన
చిలక నాఅబ్బాయి హంస అబ్బాయి
పావురం కుఱ్ఱవాడు పందిళ్లలోన.
22)
పిల్లెమ్మకన్నుల్లు బీరపువ్వుల్లు
అబ్బాయికన్నులు కలువరేకుల్లు
కలువరేకులవంటి నీ కన్నులాకు
కాటుకలు పెట్టుతే నీకు అందమ్ము.
23)
ఏడవకు ఏడవకు వెఱ్ఱినాతండ్రి
ఏడుస్తెనీకళ్ల నీరు కారేని
నీళ్లూనుకారితే నేచూడలేను
పాలైనకారవే బంగారుకళ్ల.
24)
చింతచెట్టుకింద చిటిబొమ్మరిళ్లు
వాటిక్కి వాకళ్లు బోరుతలుపుల్లు
బోరుతలుపులకింద పొందైనమేడ
ఆమేడనున్నాయి యిద్దరు హంసల్లు - ఆమేడ
ఆయిద్దరు హంసల్ల పేరేమిపేరు - ఆయిద్దరు
రాచిలుక అబ్బాయి రంభ అమ్మాయి - రాచిలుక
చిలుకలకు చెలికాడు తాను అబ్బాయి - చిలుకలకు
హంసలకు చెలికత్తె తాను అమ్మాయి.
25)
అబ్బాయి మామల్లు యెటువంటివారు
చెవికిచెవికి బారెడేసి పోగుల్లవారు - చెవికి
అంచుపంచెలవారు అంగీలవారు - అంచు
పట్టుపంచెలవారు పాగాలవారు - పట్టు
పెసరకాయవంటి పెదిమెల్లవారు - పెసర
కందికాయలవంటి కనుబొమ్మల్లవారు - కంది
మిరపకాయలవంటి మీసాలవారు - మిరప
వారు మా అబ్బాయి మేనమామల్లు.
26)
తామలపాకులమీద రేకల్లువ్రాసి
తమ్ము డంపినాడె తనముద్దుమాట
తనముద్దుమా టొకటి దబ్బపండొకటి
"నాచిన్న తమ్ముడు రార అబ్బాయి."
27)
గోరింటపువ్వువంటి కొడుకు నెత్తుకొని
బాలింత వచ్చింది బావినీళ్లక్కు
ఏదేది బాలింత యెంత చక్కందొ
మా చిన్ని పట్టుచీర మణవలకు పసుపు
కళ్లదీ కాటుక పళ్లదీ యెరుపు
మావాడ బాలింత అబ్బాయితల్లి.
28)
తూర్పున్న అబ్బాయి యిల్లుకట్టేడు
దూలాలుమోసేరు దూదిపరుపుల్లు
పడమటను అబ్బాయి యిల్లు కట్టేరు
పట్టెల్లు మోసేరు పాలకావిళ్లు
దక్షిణాన్ని అబ్బాయి యిల్లుకట్టేడు
దండెల్లు మోసేరు ధనముపెట్టెలు
ఉత్తరాన అబ్బాయి యిల్లుకట్టేడు
29)
తాతల్లు గట్టిన్న ధర్మశాలల్లు
అవ్వలు అలికిన అరుగుల్లమీద
ముత్తవ్వలు పెట్టిన ముగ్గులమీద
కూచోర అబ్బాయి కుదిమట్టగాను - కూచోర
ఊచవే అమ్మాయి వుయ్యాలచేరు - ఊచవే
పాడవే అమ్మాయి బలగ మందర్ని - పాడవే
ధరణిచే రట్టుకొని తనవార్ని పాడె - ధరణి
భూమిచేరట్టుకొని పుత్రుణ్ని పాడె.
30)
ఊరీముందర డేర లెవ్వరివి
ఉత్తమ్మబిరుదుల్ల రా జెవ్వరమ్మ
ఊరీముందర డేరల్లుమావి
ఉత్తమ్మ బిరుదల్ల రాజు అబ్బాయి.
31)
ఆయిఆయిఆయి ఆపదలు గాయి
చిన్నవాళ్లనుగాయి శ్రీవెంకటేశ
గాయిగాయిగాయి ఏదమ్మగాయి
అంగళ్ల ఆడేటి అబ్బాయిని గాయి
పోలేరమ్మ పొత్తుళ్లుగాయి
పొత్తుళ్లనాడేటి అబ్బాయి గాయి.
32)
చిన్నారిపాచికలు మావిలోగిళ్లు
చిన్నబాలా ఆడు చినబాల్లుతోడి
బంగారు పాచికలు మావిలోగిళ్లు
బాలలాడేరు మా అబ్బాయితోడి.
33)
కోటంత దేవుడికి మేటంతపత్రి
బ్రహ్మంత ఆయుస్సు నీకు నా బాబు.
34)
జోలల్లు పాడితే జొన్నల్లుపండు
జోలలకు జొనబువ్వ నీకు వరిబువ్వ
ఏడ్చేటి అబ్బాయికి యెఱ్ఱావుపాలు
నాచిన్నఅబ్బాయికి నల్లావుపాలు.
35)
అబ్బిని కొట్టిన కొట్టు వూరెల్ల రట్టు
తేరె మా అబ్బాయికి ముత్యాలబొట్టు
ముత్యాలబొట్టు మావిరేకల్లు
రత్నాలబొట్టుకీ రావిరేకల్లు
వజ్రాలుస్థాపించిన వారి మామల్లు
మాణిక్యాలు స్థాపించిన వారి బాబుల్లు
36)
అబ్బిని కొట్టిన కొట్టు వూరెల్ల రట్టు
తేరె మా అబ్బాయికి తేనె గాజుల్లు
ముత్యాలబొట్టెట్టి పట్టుచీరగట్టి
ముద్దువచ్చింది మా అబ్బాయిమోము - ముద్దు
అద్దమైతోచింది వద్దిమామలకు - అద్దమై
మేలిమై తోచింది మేనమామలకు - మేలి.
మేనమామలముద్దు మేలిమ్మి ముద్దు - మేన
తాతలకు తమ చిన్న అబ్బాయి ముద్దు.
37)
చిట్టి నాఅబ్బాయి చిఱుమొగము చూచి
సిగ్గుపడి చంద్రుడూ పొడవజాలాడు
38)
ముద్దుల్లు ముద్దుల్లు ముచ్చికాయల్లు
అమ్మాయి ముద్దుల్లు గచ్చకాయల్లు.
No comments:
Post a Comment