Rubik Cube Puzzle...... మా చెల్లెలి కొడుకు (S.Sai Saketh) 1 నిమిషం 20 సెకండ్లలో సెట్ చేసాడు :)
Showing posts with label పిల్లల ఆటలు. Show all posts
Showing posts with label పిల్లల ఆటలు. Show all posts
Wednesday, January 8, 2014
Sunday, September 29, 2013
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లుపొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లిచెయ్యంగ
సుబ్బారాయుడి పెళ్ళి చూసివద్దాం రండి
మా వాళ్లింట్లో పెండ్లి మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకు పోదాం రండి
సూర్య దేవుని చూసివత్తము రండి
Friday, August 30, 2013
ఒప్పులుకుప్పా
ఒప్పులుకుప్పా
ఒప్పులకుప్పా -- వయారి భామా
సన్నా బియ్యం -- ఛాయ పప్పు
బావిలో కప్పా -- చేతిలో చిప్పా
రోట్లో తవుడు -- నీ మొగుడెవరు ???
గూట్లో రూపాయ్ -- నీ మొగుడు సిపాయ్.....
(ఆడపిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునే ఆటలలో ఇది ఒక ఆట. శివరాత్రి పండుగ వచ్చిన...... అట్లతద్ది వచ్చిన చేతికి గోరింటాకు పెట్టుకొని...... ఉయ్యాలలు ఊగుతూ...... చెమ్మచెక్క ఆటలు ఆడుతుంటారు..... కానీ ఈ రోజులలో ఆ ముచ్చట్లేమీ అస్సలు లేనే లేవు కదా)
ఒప్పులకుప్పా -- వయారి భామా
సన్నా బియ్యం -- ఛాయ పప్పు
బావిలో కప్పా -- చేతిలో చిప్పా
రోట్లో తవుడు -- నీ మొగుడెవరు ???
గూట్లో రూపాయ్ -- నీ మొగుడు సిపాయ్.....
(ఆడపిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునే ఆటలలో ఇది ఒక ఆట. శివరాత్రి పండుగ వచ్చిన...... అట్లతద్ది వచ్చిన చేతికి గోరింటాకు పెట్టుకొని...... ఉయ్యాలలు ఊగుతూ...... చెమ్మచెక్క ఆటలు ఆడుతుంటారు..... కానీ ఈ రోజులలో ఆ ముచ్చట్లేమీ అస్సలు లేనే లేవు కదా)
Sunday, June 23, 2013
అళ్ళీకాయలాట (గోళిలాట)
అళ్ళీకాయలాట (గోళిలాట)
ఈ గోళిలాటని ఎక్కువగా మగపిల్లలు ఆడుతారు.... ఇది ఆడపిల్లలు ఆడటం తక్కువే అని చెప్పాలి. కానీ నేను కూడా చిన్నప్పుడు ఆడేను.... ఎందుకంటే నా చిన్నతనంలో మా ఇంటికి చుట్టుపక్కల అందరూ, ఎక్కువగా మగపిల్లలే ఉండేవారు. ఆడపిల్లలం తక్కువ..... మగపిల్లలు ఎక్కువగ ఉండేవాళ్ళం...... అందువల్ల ఆడపిల్లల ఆటలు మగపిల్లలు కూడా ఆడేవారు..... మగపిల్లల ఆటలు ఆడపిల్లలమైన మేము కూడా ఆడేవాళ్ళం. అందువల్ల నేను కూడా ఈ ఆటను నేర్చుకోవటం జరిగింది. కానీ ఆటలో, నేను ఎప్పుడూ ఓడిపోవటమే. గెలవటం తక్కువనే చెప్పుకోవాలి... మాఅన్నయ్య (పెద్దనాన్నగారి అబ్బాయి) ఉండేవాడు వాడిని ఎవ్వరూ ఓడించాలేకపోయేవారు. అంత బాగా ఆడేవాడు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఆటని ఆడి ఉంటే.... ఎలా ఆడేవారో నాకు కూడా చెప్పండి.... నన్ను మీతో ఆడించండి... నేను కూడా ఆడుతాను...... మరి నేను గోళీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నాను.... మీదే ఆలస్యం.... come fast......
తాడు --- బొంగరం
తాడు --- బొంగరం
తాడు-- బొంగరం ఆట అంటే మీకు తెలుసునా ? ఈ ఆట కూడా నేను ఆడాను. కింద నేల మీద తిరుగుతున్న బొంగరాన్ని తీసి, చేతిమీదకు ఎక్కించుకోవటం అంటే ఎంత వింతగా & అద్భుతంగా ఉంటుందో కదా .....నేను అలా చేతిమీదకు ఎక్కించుకొని తిప్పేదానిని.... ఈ ఆటను నాన్నతో కలసి ఆడితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా..... ఆ ఆనందాలు..... రోజులు మళ్ళీ ఒక్కసారి గుర్తుచేసుకొని గత జ్ఞాపకాలలోకి వెళ్ళిరండి మిత్రులారా...........
కర్ర -- బిళ్ళ ఆట
కర్ర -- బిళ్ళ ఆట
వేసవికాలంలో ఆడే ఆటలలో కర్ర--బిళ్ళ ఒకటి.....ఈ ఆట అంటే నాకెంత ఇష్టమో..... మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలం అంతా కలసి ఆడేవాళ్ళం... ఎవరు కొట్టిన బిళ్ళ ......ఎంత దూరం వెళుతుందో అని పందాలు వేసుకొని మరీ ఆడేవాళ్ళం....... కానీ నేను ఎక్కువ దూరం కొట్టలేక ఎప్పుడూ ఓడిపోయేదానిని.... మీరైనా ఈ ఆటలో గెలిచేవారా.... నాతో చెప్పండి మీ అనుభవాలను....
తాటికాయలతో బండి ఆట
తాటికాయలతో బండి ఆట
హల్లో స్నేహితుల్లారా ! వేసవికాలంలో తాటికాయలని తినీసి పారేస్తాము.... కానీ మా చిన్నతనంలో అయితే.....రెండు తాటికాయలకి మధ్యలో ఒక చిన్న కర్రని పెట్టి....ఆ చిన్నకర్రకి మధ్యలో పెద్దకర్రని గుచ్చి......ఒక బండీలాగా చేసుకొని ఇలా ఆడుకొనేవాళ్ళము.... ఎవరి బండీ వేగంగా పోతుందో, పోటీలు పడి మరీ ఆడేవాళ్ళము..... మీరు కూడా ఇలాగే ఆడేవాళ్ళా ??? మళ్ళీ చిన్నతనం గుర్తుకువచ్చిందా..... ఐతే ఇంకెందుకు ఆలస్యం.... పదండి మళ్ళీ చిన్నపిల్లలం ఐపోయి ఆడేసుకుందాము.
Monday, May 6, 2013
టైర్ ఆట
టైర్ ఆట
ఇలా టైర్లు కర్రతో కొట్టుకుంటూ మీరు ఎప్పుడైనా ఆడారా..... నేనైతే మగపిల్లలతో సమానంగా ఆడి గెలిచేదానిని..... వేసవికాలంలో ఎక్కువగా ఆడేవాళ్ళము ఇటువంటి ఆటలు....... అమ్మతో చెప్పకుండా.... రోడ్లపైకి వెళ్ళి, స్నేహితులతో ఆడి, ఇంటికి వచ్చాక..... అమ్మతో ఫుల్ గా చివాట్లు తినేదానిని. అప్పుడు ఆ టైంకి కోపం వచ్చేది.... కానీ ఊరుకుంటామా ఏమిటి..... తెల్లారితే మళ్ళి మామూలే..... టైర్లు పట్టుకుని రోడ్లు మీదకి పరుగులు.... నిజంగా ఆ సరదాలే వేరు. మళ్ళీ తిరిగిరాని మధుర జ్ఞాపకాలు కదా.....
"వైకుంఠపాళీ" ఆట
హాయ్ ఫ్రెండ్స్.....మరో ఆట "వైకుంఠపాళీ"
ఈ ఆటని తెలియని వారు ఉండరు అనుకుంటున్నాను. ఎందుకంటే......కాలం మారుతూఉన్నకొద్ది......పేర్లు కూడా మారిపోతున్నాయి. మా చిన్నతనంలో ఈ ఆటని "వైకుంఠపాళీ" అనేవారు.... ఇప్పుడేమో snake & ladder అంటున్నారు. పేరు ఏదైనా సరే......మనకు ఆట ముఖ్యం కదా.... ఇంట్లో కూర్చుని ఆడేసుకోవటమే మనకు కావాలి. పదండి ఒక ఆట ఆడేద్దాము...... అందరిని పిలుచుకురండి త్వరగా...... :))))
దాడిఆట
దాడిఆట
హలో ఫ్రెండ్స్.......మనకి ఇక వేసవిసెలవులు వచ్చేసాయి కదా......బయటకి వెళ్ళి ఆడుకుందామంటే ఎండమండిపోతుంది, బయటకు వెళ్ళి ఆడకు అని అమ్మ దెబ్బలాడుతుంది కదా...... మరి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి..... చక్కగా ఇంట్లో బుద్దిగా కూర్చుని...... ఇంట్లో ఆడుకునే(indoor games) ఆటలు ఆడుకోవాలి. అలాంటి ఆటలు కొన్నిటిని నేను గుర్తుచేస్తాను, మీరు కూడా నేర్చుకొని ఆడుకొండే..... అప్పుడు అమ్మతో తిట్లు తినక్కరలెద్దు.... ఎండలోకి వెళ్ళి ఆడుకోనక్కరలేద్దు...... బుద్ధిగా ఇంట్లో కూర్చుని స్నేహితులతో ఆడుకోవచ్చును....
ఇదిగో ఇక్కడ చూసారా ఈ ఆటని.....దీనినే "దాడి ఆట" అని అంటారు. ఈ ఆటని 3-9-11...రాళ్ళతో, ఆడుకోవచ్చును. 3 రాళ్ళు వరసగా వస్తే దాడి అయినట్లు. అలా ఎవరైతే ముందుగా దాడి చేస్తారో వాళ్ళే గెలిచినట్లు..... బావుంది కదూ దాడిఆట........ మరి ఇంక ఆలస్యం ఎందుకు..... అమ్మని ఎలా ఆడాలో అడిగి తెలుసుకొని, ఆట మొదలుపెట్టండి..... enjoyyyyyyyy....
ఇదిగో ఇక్కడ చూసారా ఈ ఆటని.....దీనినే "దాడి ఆట" అని అంటారు. ఈ ఆటని 3-9-11...రాళ్ళతో, ఆడుకోవచ్చును. 3 రాళ్ళు వరసగా వస్తే దాడి అయినట్లు. అలా ఎవరైతే ముందుగా దాడి చేస్తారో వాళ్ళే గెలిచినట్లు..... బావుంది కదూ దాడిఆట........ మరి ఇంక ఆలస్యం ఎందుకు..... అమ్మని ఎలా ఆడాలో అడిగి తెలుసుకొని, ఆట మొదలుపెట్టండి..... enjoyyyyyyyy....
Sunday, April 21, 2013
Happyga Holi
Happyga Holi
హోళీ పర్వదినాన్ని మనం చాలా భక్తి స్రద్దలతో చాలా ఆనందంగా జరుపుకుంటాము కదా.... కాని హోళీ రంగుల్లో రసాయనాలని ఉపయోగించకుండా సహజ రంగులని ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ ఆనందం పొందినవారమవుతాము కదా..... ఒక్కసారి ఆలోచించండి...... ఆ సహజ రంగులు ఏవో నేను చెబుతాను మీరు కూడా వాడి చూడండి.. నేను ప్రతీ సంవత్సరము ఇలాగే రంగులు తయారుచేసి వాడుతూ ఉంటాను.... అందుకే మీకు చెబుతున్నాను.......
1)పసుపుని సెనగపిండితో కలిపితే పసుపు రంగు వస్తుంది...... ఇది నీటిలో కలిపి జల్లుకుంటే ఎటువంటి ప్రమాదము ఉండదు..పసుపుని చందనం పొడితో కలిపి నీటిలో వేసినా పసుపు రంగు వస్తుంది.....
2)పాలకూర వంటి ఆకుకూరలని సెనగపిండితో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది...... లేదంటే గోరింటాకు పౌడర్ ని సెనగపిండితో కలిపి నీటిలో కలుపుకోవచ్చును & కేవలము గోరింటాకు పౌడర్ ని నీటిలో కలిపినా ఆకుపచ్చ రంగు వస్తుంది.....
3)బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని గులాబీ రేకులతో కలిపి రాత్రంతా నీటిలో నానపెడితే లేత ఎరుపు రంగు వస్తుంది.......టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలిపినా ఎరుపు రంగు వస్తుంది... మందారపూలుని ఎండబెట్టి పౌడర్ చేసి నీటిలో కలిపినా ఎరుపు రంగు వస్తుంది.....
4)గులాబి రేకులని నీటిలో నానపెట్టి గ్రైండ్ చేస్తే అందమైన గులాబి రంగు వస్తుంది....
5)నారింజ-- బత్తాయి తొక్కలని ఎండబెట్టి పౌడర్ చేసుకొని నీటిలో కలిపితే నారింజ రంగు వస్తుంది....
5)నారింజ-- బత్తాయి తొక్కలని ఎండబెట్టి పౌడర్ చేసుకొని నీటిలో కలిపితే నారింజ రంగు వస్తుంది....
6)రకరకాల పువ్వులను & ఆకులను కలిపి నీటిలో నానబెట్టి గ్రైండ్ చేస్తే సరికొత్తరంగు తయారవుతుంది..
Subscribe to:
Posts (Atom)










