చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లుపొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లిచెయ్యంగ
సుబ్బారాయుడి పెళ్ళి చూసివద్దాం రండి
మా వాళ్లింట్లో పెండ్లి మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకు పోదాం రండి
సూర్య దేవుని చూసివత్తము రండి
No comments:
Post a Comment