Wednesday, September 25, 2013

కొండాపల్లి కొయ్యా బొమ్మా

కొండాపల్లి కొయ్యా బొమ్మా

చెన్నాపట్నం చెరకు ముక్కా నీకో ముక్కా నాకో ముక్క భీమునిపట్నం బిందెల జోడూ నీకో బిందె నాకో బిందె కాళీపట్నం కాసుల పేరు నీకో పేరూ నాకో పేరూ

కొండాపల్లి కొయ్యా బొమ్మా నీకో బొమ్మా, నాకో బొమ్మా.
నక్కాపల్లీ లక్కా పిడతలు నీకో పిడత, నాకో పిడత
నిర్మల పట్నం బొమ్మల పలకలు నీకో పలకా నాకో పలకా.
బంగిన పల్లీ మామిడి పండ్లూ నీకో పండూ, నాకో పండూ
ఇస్తానుండూ తెచ్చేదాకా చూస్తూవుండూ ఇచ్చేదాకా.








No comments:

Post a Comment