Sunday, September 29, 2013

ఉత్తమ గురువు

ఉత్తమ గురువు

గడపలన్నింటిలోను ఏ గడప మేలు ? మహలక్ష్మి నర్తించు మా గడప మేలు అరుగులన్నింటిలోను ఏ అరుగు మేలు ? అథిదులందరుజేరు మా గడప మేలు వీధులన్నింటిలోను ఏ వీధి మేలు ? విద్వాంసులుండేటి మా వీధి మేలు ఊరులన్నింటిలోనూ ఏ ఊరు మేలు ? పాడి పంటలు విరసిల్లు మా ఊరు మేలు గురువులందరిలోను ఏ గురువు మేలు ? వేదసారము తెల్పు మా గురువు మేలు


No comments:

Post a Comment