Showing posts with label చిలక మీద పద్యాలు. Show all posts
Showing posts with label చిలక మీద పద్యాలు. Show all posts

Wednesday, September 25, 2013

చిలకమ్మ పెండ్లి --- రచన-గిడుగు వెంకట సీతాపతి

చిలకమ్మ పెండ్లి
రచన-గిడుగు వెంకట సీతాపతి

చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెక బెక - డప్పులు కొట్టగా కొక్కొరోకోయని - కోడికూయగా
ఝుమ్మని తుమ్మెద - తంబుర మీటగ కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తుమ్మెరలు - వేణువునూదగా నెమలి సొగసుగా - నాట్యమ్ము చేయగా
సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లికుమారుడు బింకమ్ము చూపగా
మల్లీ మాలతి - మాధవీలతలు పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగ మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తై







Friday, August 30, 2013

చిలుక పలుకులు

చిలుక పలుకులు 

చిట్టి చిలకమ్మా -- పలుకు పలుకమ్మా 

ఆ గువ్వను చూడమ్మా -- గూడు కట్టమ్మా 

కోడీ పెట్టమ్మా -- గుడ్డూ పెట్టమ్మా 


పావురాయమ్మా -- పాపకీయమ్మా 

పాప చేతిలో ఉందమ్మా -- పంచదార చిలుకమ్మా






Monday, May 6, 2013

ఎగిరెదవెందుకే చిలుకా చిలుకా

ఎగిరెదవెందుకే చిలుకా చిలుకా !


ఎగిరెదవెందుకే చిలుకా చిలుకా !

లోకం చూడగ కోరిక కనుక 

పలికెద వెందుకే చిలుకా చిలుకా !

ఊహలు చెప్పగ మనసగు కనుక

అలిగెద వెందుకే చిలుకా చిలుకా !


కాయలు పండ్లు ఈయరు గనుక.....



Sunday, April 21, 2013

చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది

చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది



చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది

తాత బోడిబుర్ర మీద పిలక ఉన్నది


చిలక ముక్కు తాత ముక్కు తీరునున్నది


చింత తొర్ర తాత బుర్ర తీరునున్నది


తాతకాళ్ళకున్న జోడు కిర్రుమన్నది

చింతచెట్టు తొర్రలోన చిలుక తుర్రుమన్నది



బుర్రుపిట్ట

బుర్రుపిట్ట 


బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది 

పడమటింటి కాపురం చెయ్యనన్నది 

అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది 


మామ తెచ్చిన మల్లెమొగ్గ ముడవనన్నది 

మొగునిచేత మొట్టికాయలు తింటానన్నది