Monday, September 30, 2013
Sunday, September 29, 2013
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లుపొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లిచెయ్యంగ
సుబ్బారాయుడి పెళ్ళి చూసివద్దాం రండి
మా వాళ్లింట్లో పెండ్లి మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకు పోదాం రండి
సూర్య దేవుని చూసివత్తము రండి
ఉత్తమ గురువు
ఉత్తమ గురువు
గడపలన్నింటిలోను ఏ గడప మేలు ? మహలక్ష్మి నర్తించు మా గడప మేలు అరుగులన్నింటిలోను ఏ అరుగు మేలు ? అథిదులందరుజేరు మా గడప మేలు వీధులన్నింటిలోను ఏ వీధి మేలు ? విద్వాంసులుండేటి మా వీధి మేలు ఊరులన్నింటిలోనూ ఏ ఊరు మేలు ? పాడి పంటలు విరసిల్లు మా ఊరు మేలు గురువులందరిలోను ఏ గురువు మేలు ? వేదసారము తెల్పు మా గురువు మేలు
తెలుపు వర్ణం
తెలుపు వర్ణం
అమ్మ మాట తెలుపు - ఆవు పాలు తెలుపు మల్లె పూలు తెలుపు - మంచి మాట తెలుపు చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు మంచి మనసు తెలుపు - పావురాయి తెలుపు పంచదార తెలుపు - పాలు పెరుగు తెలుపు గురువుగారి చొక్కా తెలుపు - గోవింద నామము తెలుపు జాజి పూలు తెలుపు - జాబిల్లి తెలుపు జాలి గుండె తెలుపు - చల్లని మంచు తెలుపు వెన్నెలమ్మ తెలుపు - వేప పువ్వు తెలుపు మంచి ముత్యం తెలుపు - పాపాయి నవ్వు తెలుపు
Wednesday, September 25, 2013
చిలకమ్మ పెండ్లి --- రచన-గిడుగు వెంకట సీతాపతి
చిలకమ్మ పెండ్లి
రచన-గిడుగు వెంకట సీతాపతి
చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెక బెక - డప్పులు కొట్టగా కొక్కొరోకోయని - కోడికూయగా
ఝుమ్మని తుమ్మెద - తంబుర మీటగ కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తుమ్మెరలు - వేణువునూదగా నెమలి సొగసుగా - నాట్యమ్ము చేయగా
సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లికుమారుడు బింకమ్ము చూపగా
మల్లీ మాలతి - మాధవీలతలు పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగ మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తై

మాఇంటి పక్షులు
మాఇంటి పక్షులు

చిలుకల్లు చిలుకల్లు అందురేకాని చిలుకలకు రూపేమి పలుకులేగాని
హంసల్లు హంసల్లు అందురేకాని హంసలకు రూపేమి ఆటలేగాని
పావురాలు పావురాలు అందురేకాని పార్వాలకు రూపేమి పాటలేగాని
కోయిల్లు కోయిల్లు అందురేకాని కోయిల్లకు రూపేమి గోషలేగాని
చిలకల్లు మా ఇంటి చిన్న కోడళ్ళు
హంసలు మా ఇంటి ఆడపడుచుల్లు
పావురాలు మా ఇంటి బాలపాపల్లు కోయిల్లు మా ఇంటి కొత్తకోడళ్ళు

చిలుకల్లు చిలుకల్లు అందురేకాని చిలుకలకు రూపేమి పలుకులేగాని
హంసల్లు హంసల్లు అందురేకాని హంసలకు రూపేమి ఆటలేగాని
పావురాలు పావురాలు అందురేకాని పార్వాలకు రూపేమి పాటలేగాని
కోయిల్లు కోయిల్లు అందురేకాని కోయిల్లకు రూపేమి గోషలేగాని
చిలకల్లు మా ఇంటి చిన్న కోడళ్ళు
హంసలు మా ఇంటి ఆడపడుచుల్లుపావురాలు మా ఇంటి బాలపాపల్లు కోయిల్లు మా ఇంటి కొత్తకోడళ్ళు

కొండాపల్లి కొయ్యా బొమ్మా
కొండాపల్లి కొయ్యా బొమ్మా
చెన్నాపట్నం చెరకు ముక్కా నీకో ముక్కా నాకో ముక్క భీమునిపట్నం బిందెల జోడూ నీకో బిందె నాకో బిందె కాళీపట్నం కాసుల పేరు నీకో పేరూ నాకో పేరూ
కొండాపల్లి కొయ్యా బొమ్మా నీకో బొమ్మా, నాకో బొమ్మా.
నక్కాపల్లీ లక్కా పిడతలు నీకో పిడత, నాకో పిడత
నిర్మల పట్నం బొమ్మల పలకలు నీకో పలకా నాకో పలకా.
బంగిన పల్లీ మామిడి పండ్లూ నీకో పండూ, నాకో పండూ
ఇస్తానుండూ తెచ్చేదాకా చూస్తూవుండూ ఇచ్చేదాకా.

Subscribe to:
Posts (Atom)