నేను రాసిన కరోనా కవితకి పిల్లలు act చేసిన వీడియో
కరోనా బూచి వచ్చింది
కరోనా బూచి వచ్చింది
కోరలు చాచుకొని కూర్చుంది
కంటపడిన వాళ్ళని కాటేస్తోంది
మందులు మంత్రాలు లేవంట
మరుగున మనం ఉండటమే మేలంట
ఇంట్లోనే అందరూ ఉండండి
గడపదాటి బయటకి ఎవరూ పోకండి
పోలీసు మామలు ఉన్నారు
పో పో అని తరిమికొడుతున్నారు
సుచి శుభ్రత పాటిస్తే
మన దగ్గరకి అది రానంది
మనుషులను దూరంగా ఉండమంది
మనసులని దగ్గరగా చేసింది
కాళ్ళూ చేతులు కడగండి
ముక్కూ మూతి మూసుకొండి
మాస్కుని కట్టుకొని కూర్చోండి
సానిటైజ్ అందరూ వాడండి
అమ్మానాన్నలతో ఆనందంగా ఆటలాడుదాం
నానమ్మ తాతలు చెప్పే కథలు విందాం
చెస్సు క్యారమ్స్ ఆటలన్నీ
ఇంట్లోనే కూర్చొని ఆడుకుందాం
షేక్ హ్యాండ్ ఎవరికీ ఇవ్వొద్దు
నమస్కారమే మనకి ముద్దు
నే చెప్పినవన్నీ బాగా వినండి
నవ్వుతూ హాయిగా బ్రతకండి
@శ్వేతవాసుకి .....12/4/2020
కరోనా బూచి వచ్చింది
కరోనా బూచి వచ్చింది
కోరలు చాచుకొని కూర్చుంది
కంటపడిన వాళ్ళని కాటేస్తోంది
మందులు మంత్రాలు లేవంట
మరుగున మనం ఉండటమే మేలంట
ఇంట్లోనే అందరూ ఉండండి
గడపదాటి బయటకి ఎవరూ పోకండి
పోలీసు మామలు ఉన్నారు
పో పో అని తరిమికొడుతున్నారు
సుచి శుభ్రత పాటిస్తే
మన దగ్గరకి అది రానంది
మనుషులను దూరంగా ఉండమంది
మనసులని దగ్గరగా చేసింది
కాళ్ళూ చేతులు కడగండి
ముక్కూ మూతి మూసుకొండి
మాస్కుని కట్టుకొని కూర్చోండి
సానిటైజ్ అందరూ వాడండి
అమ్మానాన్నలతో ఆనందంగా ఆటలాడుదాం
నానమ్మ తాతలు చెప్పే కథలు విందాం
చెస్సు క్యారమ్స్ ఆటలన్నీ
ఇంట్లోనే కూర్చొని ఆడుకుందాం
షేక్ హ్యాండ్ ఎవరికీ ఇవ్వొద్దు
నమస్కారమే మనకి ముద్దు
నే చెప్పినవన్నీ బాగా వినండి
నవ్వుతూ హాయిగా బ్రతకండి
@శ్వేతవాసుకి .....12/4/2020
No comments:
Post a Comment