Tuesday, January 7, 2014

శబ్దాల పాట

శబ్దాల పాట 

చేతులు కలిపిన చప్పట్లు
మనుషులు కలిసి ముచ్చట్లు

చిటికలు వేసిన సవ్వళ్ళు
చిందులు వేసిన చీవాట్లు

గంటలు మ్రోగిన గణగణలు
గాజులు మ్రోగిన గలగలలు

రహస్యమైతే గుసగుసలు
రచ్చకెక్కితే రుసరుసలు


No comments:

Post a Comment