కోతిబావ
కోతిబావ నీకు కోపమెక్కువ
చిలిపివాడు పలకరిస్తే చిందులెక్కువ
అరటిపండ్లు చుస్తే చాలు ఆకలెక్కువ
పిందెలన్ని త్రుంచిపెట్ట ప్రీతి ఎక్కువ
చిలిపి పనులు చేయుటలో గర్వమెక్కువ
కర్రపుల్ల చూడగానే కంపమెక్కువ
కన్నబిడ్డలంటే నీకు ప్రేమ తక్కువ
గుణము ఎంచనేల నీకు కుదురు తక్కువ