Friday, October 24, 2014

జలజల పువ్వులు - కిలకిల నవ్వులు

జలజల పువ్వులు 

జలజల పువ్వులు - కిలకిల నవ్వులు 
గణగణ గంటలు - ధగధగ మంటలు 
తళతళ మెరుపులు - పెళపెళ ఉరుములు 
గుసగుస మాటలు - రుసరుస కోపం 
నకనక ఆకలి - చకచక రోకలి 
ఘుమఘుమ ధూపం - ధుమధుమ కోపం  



మొదటిది మొగ్గ - రెండోది రోజా

అంకెలతో పాట

మొదటిది మొగ్గ - రెండోది రోజా
మూడోది ముత్యం - నాలుగోది నాగు
అయిదోది అక్క - ఆరోది ఆవు
ఏడోది ఏనుగు - ఎనిమిదోది ఎలుక
తోమ్మిదోది తొండ - పదోది పలక


ఒకటి - రెండు - ఒప్పులకుప్ప

అంకెల పాట

ఒకటి - రెండు - ఒప్పులకుప్ప
మూడు నాలుగు - ముద్దులగుమ్మ
అయిదు ఆరు - అందాల భరిణ
ఏడు ఎనిమిది - వయ్యరిభామ
తొమ్మిది పది - బంగారు బొమ్మ


అ ఆ లు దిద్దుదాం - అమ్మ మాట విందాం

అమ్మ మాట విందాము

అ ఆ లు దిద్దుదాం - అమ్మ మాట విందాం
ఇ ఈ లు దిద్దుదాం - ఈశ్వరుని కొలుద్దాం
ఉ ఊ లు దిద్దుదాం - ఊయలులు ఊగుదాం
ఎ ఏ ఐ లు దిద్దుదాం - ఏనుగెక్కి వెళదాం
ఒ ఓ ఔ లు దిద్దుదాం - ఓనమాలు దిద్దుదాం
అం అః లు దిద్దుదాం - ఆనందంగా పాడుదాం


ఆదివారం ఆటాపాటా

ఆటా - పాటా

ఆదివారం ఆటాపాటా
సోమవారం చెమ్మచెక్క
మంగళవారం మాటామంతి
బుధవారం బువ్వాబంతి
గురువారం గుడుగుడుగుంజం
శుక్రవారం చుక్ చుక్ రైలు
శనివారం చెట్టాపట్టాల్


ఆటలంటే మాకిష్టం

ఆటలు - పాటలు

ఆటలంటే మాకిష్టం
పాటలంటే మాకిష్టం
ఆడుకుంటూ పాడుకుంటూ
అలా ఉండటం మాకిష్టం
పక్షులంటే మాకిష్టం
వాటి పిల్లలంటే మాకిష్టం
పక్షి పిల్లలతో ఆడుకోవటం అంటే మరీ మరీ ఇష్టం


గుండు గుండు గుండున్నర

టైము

గుండు గుండు గుండున్నర
టైము చూస్తే ఆరున్నర
బడికి వెళితే ఎనిమిదిన్నర
లంచికి లేస్తే ఒకటిన్నర
ఇంటికిపోతే ఐదున్నర