Sunday, June 23, 2013

రాజహంస

రాజహంస 

రాజహంస తెల్లన 
దాని నడక చక్కన 
రామచిలుక పచ్చన 
దాని పలుకు కమ్మన
కోకిలమ్మ నల్లన
దాని పాట తియ్యన



వారాల పాట

వారాల పాట


ఆటలు పాటలు -- ఆదివారం 
షోకులు సొగసులు -- సోమవారం
మాటామంతి -- మంగళవారం  
బుద్ధులు సుద్దులు -- బుధవారం
గుజ్జనగూళ్ళు -- గురువారం 
చుట్టాలు పక్కాలు -- శుక్రవారం 
సంతోషం సరదాలు -- శనివారం  



వానా వానా వల్లప్ప

వానా వానా వల్లప్ప 

వానా వానా వల్లప్పా
వాకిట తిరుగు చెల్లప్పా

వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్పా

తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగలేనే నరసప్పా

(చిన్నప్పుడు వాన పడుతుంటే పిల్లలు పాడుకునే పాట ఇది..... ఇప్పటికి వర్షం పడుతుంటే ఇదే పాట గుర్తుకు వస్తుంది..... మీకు గుర్తు ఉందా ఈ పాట)


అళ్ళీకాయలాట (గోళిలాట)

అళ్ళీకాయలాట (గోళిలాట)


ఈ గోళిలాటని ఎక్కువగా మగపిల్లలు ఆడుతారు.... ఇది ఆడపిల్లలు ఆడటం తక్కువే అని చెప్పాలి. కానీ నేను కూడా చిన్నప్పుడు ఆడేను.... ఎందుకంటే నా చిన్నతనంలో మా ఇంటికి చుట్టుపక్కల అందరూ, ఎక్కువగా మగపిల్లలే ఉండేవారు. ఆడపిల్లలం తక్కువ..... మగపిల్లలు ఎక్కువగ ఉండేవాళ్ళం...... అందువల్ల ఆడపిల్లల ఆటలు మగపిల్లలు కూడా ఆడేవారు..... మగపిల్లల ఆటలు ఆడపిల్లలమైన మేము కూడా ఆడేవాళ్ళం. అందువల్ల నేను కూడా ఈ ఆటను నేర్చుకోవటం జరిగింది. కానీ ఆటలో, నేను ఎప్పుడూ ఓడిపోవటమే. గెలవటం తక్కువనే చెప్పుకోవాలి...  మాఅన్నయ్య (పెద్దనాన్నగారి అబ్బాయి) ఉండేవాడు వాడిని ఎవ్వరూ ఓడించాలేకపోయేవారు. అంత బాగా ఆడేవాడు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఆటని ఆడి ఉంటే.... ఎలా ఆడేవారో నాకు కూడా చెప్పండి.... నన్ను మీతో ఆడించండి... నేను కూడా ఆడుతాను...... మరి నేను గోళీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నాను.... మీదే ఆలస్యం.... come fast......


తాడు --- బొంగరం

తాడు --- బొంగరం

తాడు-- బొంగరం ఆట అంటే మీకు తెలుసునా ? ఈ ఆట కూడా నేను ఆడాను. కింద నేల మీద తిరుగుతున్న బొంగరాన్ని తీసి, చేతిమీదకు ఎక్కించుకోవటం అంటే ఎంత వింతగా & అద్భుతంగా ఉంటుందో కదా .....నేను అలా చేతిమీదకు ఎక్కించుకొని తిప్పేదానిని.... ఈ ఆటను నాన్నతో కలసి ఆడితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా..... ఆ ఆనందాలు..... రోజులు మళ్ళీ ఒక్కసారి గుర్తుచేసుకొని గత జ్ఞాపకాలలోకి వెళ్ళిరండి మిత్రులారా...........


కర్ర -- బిళ్ళ ఆట

కర్ర -- బిళ్ళ ఆట

వేసవికాలంలో ఆడే ఆటలలో కర్ర--బిళ్ళ ఒకటి.....ఈ ఆట అంటే నాకెంత ఇష్టమో..... మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలం అంతా కలసి ఆడేవాళ్ళం... ఎవరు కొట్టిన బిళ్ళ ......ఎంత దూరం వెళుతుందో అని పందాలు వేసుకొని మరీ ఆడేవాళ్ళం....... కానీ నేను ఎక్కువ దూరం కొట్టలేక ఎప్పుడూ ఓడిపోయేదానిని....  మీరైనా ఈ ఆటలో గెలిచేవారా.... నాతో చెప్పండి మీ అనుభవాలను.... 


తాటికాయలతో బండి ఆట

తాటికాయలతో బండి ఆట

హల్లో స్నేహితుల్లారా ! వేసవికాలంలో తాటికాయలని తినీసి పారేస్తాము.... కానీ మా చిన్నతనంలో అయితే.....రెండు తాటికాయలకి మధ్యలో ఒక చిన్న కర్రని పెట్టి....ఆ చిన్నకర్రకి మధ్యలో పెద్దకర్రని గుచ్చి......ఒక బండీలాగా చేసుకొని ఇలా ఆడుకొనేవాళ్ళము.... ఎవరి బండీ వేగంగా పోతుందో, పోటీలు పడి మరీ ఆడేవాళ్ళము..... మీరు కూడా ఇలాగే ఆడేవాళ్ళా ??? మళ్ళీ చిన్నతనం గుర్తుకువచ్చిందా..... ఐతే ఇంకెందుకు ఆలస్యం.... పదండి మళ్ళీ చిన్నపిల్లలం ఐపోయి ఆడేసుకుందాము.


మాయదారిపిల్లి

మాయదారిపిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి -- మయదారిపిల్లి 
మ్యావ్ మ్యావ్ పిల్లి -- మీసాల పిల్లి 

దొంగవలె -- ఇంటికొచ్చి 
పాలుతాగి -- పెరుగుతిని 

నేతి గిన్నె -- ఖాళీ చేసి 
కుండలన్ని -- కిందతోసి

కళ్ళుతెరిచి -- మూసికొనుచు
పారిపోవు -- దొంగపిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి -- మాయదారి పిల్లి
మ్యావ్ మ్యావ్ పిల్లి -- మీసాల పిల్లి

(మీ ఇంటికి కూడా పిల్లుల్లు వచ్చి ఇలాగే పాలు, పెరుగు తగేస్తాయా మా ఇంటికి వచ్చి దొంగ పిల్లులు తగేస్తాయి)